కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష పార్టీలు..

- May 24, 2023 , by Maagulf
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష పార్టీలు..

న్యూ ఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం ని తేల్చి చెప్పాయి. రాష్ట్రపతి ముర్ముని పూర్తిగా పక్కనపెట్టి, కొత్త పార్లమెంటు భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని ప్రధాని మోడీ నిర్ణయించడం రాష్ట్రపతిని అవమానించడమే నని..కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన సందర్భం అని..బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తోందని విమర్శించాయి.

రాష్ట్రపతి ముర్ముని పూర్తిగా పక్కనపెట్టి, కొత్త పార్లమెంటు భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని ప్రధాని మోడీ నిర్ణయించడం రాష్ట్రపతిని అవమానించడమేనని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్న ఆయా పార్టీలు మన ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించాయి. రాష్ట్రపతి భారతదేశంలో దేశాధినేత మాత్రమే కాదు..పార్లమెంటులో అంతర్భాగం కూడా నని..రాష్ట్రపతి లేకుండానే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారని ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి. ప్రధాని మోదీ చేస్తున్న ఈ చర్య రాష్ట్రపతి ఉన్నత పదవిని అవమానిస్తోందని..రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించటమేనని పేర్కొన్నాయి.

బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశపు మొదటి మహిళా ఆదివాసీ రాష్ట్రపతి స్ఫూర్తిని ఇది బలహీనపరుస్తోందన్నాయి. పార్లమెంటును నిర్దాక్షిణ్యంగా తూట్లు పొడిచిన ప్రధానికి అప్రజాస్వామిక చర్యలు కొత్త కాదుని విమర్శించాయి.భారత ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు అనర్హులు, సస్పెండ్, మాట్లాడకుండా గొంతులు నొక్కేయటం అలవాటుగా మారింది అంటూ విమర్శలు సంధించాయి.బీజేపీ ఏక పక్ష నిర్ణయాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఏక పక్ష నిర్ణయాలతో తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలతో సహా అనేక వివాదాస్పద చట్టాలు దాదాపు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించబడ్డాయని ఆరోపించాయి పార్టీలు.

కొత్త పార్లమెంటు భవనం శతాబ్దానికి ఒకసారి సంభవించే మహమ్మారి సమయంలో భారతదేశ ప్రజలు లేదా ఎంపీలతో ఎటువంటి సంప్రదింపులు చాలా ఖర్చుతో నిర్మించబడింది..వారికోసం దీన్ని నిర్మించుకున్నారని..ప్రజాస్వామ్యం ఆత్మ పార్లమెంటు నుండి బయటకు వచ్చినప్పుడు, కొత్త భవనంలో ప్రజాస్వామ్యానికి విలువ కనిపించదని అభిప్రాయపడ్డాయి.కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని మా సమిష్టి నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని 19 పార్టీలు ప్రకటించాయి.ఈ నిరంకుశ ప్రధాన మంత్రికి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశాయి.మా ఈ సందేశాన్ని భారతదేశ ప్రజల దృష్టికి తీసుకెళతామని వెల్లడించాయి 19 ప్రతిపక్ష పార్టీలు.

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణ పై ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన  19 ప్రతిపక్ష పార్టీల వివరాలు...

భారత జాతీయ కాంగ్రెస్..
ద్రవిడ మున్నేట్ర కజగం
సమాజ్ వాదీ పార్టీ
జార్ఖండ్ ముక్తి మోర్చా
ఆమ్ ఆద్మీ పార్టీ
శివసేన (UBT)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
కేరళ కాంగ్రెస్ (మణి)
విదుతలై చిరుతైగల్ కట్చి
రాష్ట్రీయ లోక్ దళ్
తృణమూల్ కాంగ్రెస్
జనతాదళ్ (యునైటెడ్)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
రాష్ట్రీయ జనతా దళ్
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
నేషనల్ కాన్ఫరెన్స్
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com