ప్రధానికి మోడీకి అభినందనలు తెలిపిన సీఎం జగన్
- May 25, 2023
అమరావతి: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఇటీవల నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీకి జగన్ అభినందనలు తెలిపారు. తాము మహత్తర ఘట్టానికి హాజరవుతామని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
‘కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోడీకి అభినందనలు. పార్లమెంటు అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. దేశ ఆత్మను పార్లమెంట్ ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి పార్లమెంట్ భవనం ప్రారంభాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు. రాజకీయంగా పార్టీలు తమ అభిప్రాయాలను పక్కనపెట్టి, ఈ అపురూప ఘట్టానికి హాజరు కావాలని కోరుతున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రక కార్యక్రమానికి మా పార్టీ (వైస్సార్సీపీ) హాజరవుతుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
కాగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం గురించి రాజకీయాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని.. తాము ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని 19 విపక్ష పార్టీలు బుధవారం స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







