APNRTS సేవలను ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకోవాలి : ఇలియాస్ బి.హెచ్.
- May 25, 2023
కువైట్: కువైట్ కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కువైట్ లోని సాల్మియా ప్రాంతంలో గల వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశములో ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో APNRTS ఛైర్మన్ మేడపాటి వెంకట్ నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సమస్యలను పరిష్కరించడములో ముందుటుందని APNRTS సేవలను తెలియజేస్తూ ప్రవాసాంధ్రులు APNRTS సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియచేస్తూ కడప ఇస్లామిక్ సొసైటీ వారు కువైట్ లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో చేస్తున్న సామాజిక సేవలను హార్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
వైఎస్సార్సిపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా ఆదుకోవడమే గాక వివిధ దేశాల నుండి 45 వేలకు పైగా వచ్చిన తెలుగు ప్రవాసీలను విమానాశ్రయాల వద్ద వారిని ప్రభుత్వం ద్వారా స్వాగతం పలికి APNRTS ద్వారా వాటర్, జ్యుస్, బిస్కెట్స్, సమోసాలను అందించడం మరియు వారి స్వస్ధల వరకు RTC ద్వారా ఉచిత ప్రయాణమే గాక వారి స్వస్దలల వద్దనే ఉచిత క్వారంటైన్, నాణ్యమైన ఉచిత భోజనంతో పాటు వచ్చిన వారికి అన్ని మంచి సాదుపాయాలు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు,అని తెలిపారు.
APNRTS కువైట్ రిజినల్ కో-ఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రవాసాంధ్ర భరోసా భీమా ప్రవాసంలో ఉన్న ప్రతి తెలుగు వారు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం 550 రూపాయలకు రోజుకు 50 పైసలకు ప్రమాదం మూలంగా మరణించిన శాశ్వత అంగవైకల్యం కలిగిన 10 లక్షలు మరియు అనారోగ్యానికి పాలైతే లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్ ద్వారా APNRTS వారు ఇప్పిస్తారని తెలిపారు ప్రవాసాంధ్ర భరోసా భీమా వారి కుటుంబానికి భరోసా లాంటిదన్నారు.
కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు షేక్ హనీఫ్. పి. షౌకత్ ఖాన్ తమ సొసైటీ కుల మత ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న సామాజిక సేవలను వివరిస్తూ కువైట్ లో APNRTS సభ్యులు చేస్తున్న సేవలు అమోఘమని సొసైటీ సభ్యుల తరపున అభినందనలు తెలుపుతూ APNRTS ద్వారా వై.యస్.ఆర్, అన్నయ్య జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇవ్వాలని అభ్యర్ధన చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సిపీ కువైట్ కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసా రెడ్డి, సొసైటీ సభ్యులు న్యామతుల్లా, లక్కీ ఆజిస్, షామిర్ , ఖాదర్, అక్బర్, యూసుఫ్, మహమ్మద్ సలీమ్, ఇంతియాజ్ , జాహిద్, తదితరులు పాల్గోన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







