ఒమన్‌లో వైద్య నివేదికల కోసం కొత్త సిస్టమ్
- May 25, 2023
మస్కట్: నివాసితులు రెన్యూవల్స్ కోసం లేదా కొత్త రెసిడెన్సీ కార్డులను పొందడం కోసం అవసరమైన వైద్య పరీక్షల నివేదికలను సులభంగా పొందేందుకు ఒక కొత్ వ్యవస్థను ప్రారంభించినట్లు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) వెల్లడించింది. దీని సాయంతో 'మెడికల్ ఫిట్‌నెస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫర్ రెసిడెన్సీ పర్పస్' వైద్య నివేదికలను నివాసితులు, కంపెనీలు సులభంగా పొందటానికి అనుమతిస్తుందని తెలిపింది. పౌర వ్యవహారాలలో సేవా కేంద్రాల నుండి రెసిడెన్సీని పునరుద్ధరించడానికి లేదా రెసిడెన్సీ కార్డులను పొందేందుకు, మొదటిసారి వీసాలు పొందేందుకు వైద్య పరీక్షలు తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఈ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, నకిలీ నివేదికలను తగ్గించడం, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్త సిస్టమ్ ను తీసుకొచ్చినట్లు MoH తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







