ఆకాశంలో ఇంజన్ వైఫల్యం.. దుబాయ్‌కి మళ్లించిన ప్యాసింజన్ విమానం
- May 28, 2023
యూఏఈ: మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ నేపథ్యంలో బ్యాంకాక్ నుండి ఆమ్స్టర్డామ్కు వెళుతున్న KLM విమానాన్ని అత్యవసరంగా దుబాయ్ కి మళ్లించారు. ఫ్లైట్ KL876 - బోయింగ్ 777-200ER విమానం.. ఇరాన్ మీదుగా ఎగురుతున్న సమయంలో ఇంజన్ లో వైఫల్యం ఏర్పడట్టు పైలెట్లు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. దీంతో అత్యవసరంగా పైలట్ విమానాన్ని దుబాయ్‌లో ల్యాండ్ చేశాడు. విమానం రాగానే ఎమర్జెన్సీ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. విమానానికి ఎలాంటి ప్రమాదం జరుగపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వారం ప్రారంభంలో వాతావరణ పరిస్థితుల కారణంగా మంగళూరు నుండి బెంగళూరుకు వెళ్లే దేశీయ భారతీయ విమానాన్ని దుబాయ్‌కి మళ్లించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 160 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







