తూర్పు జపాన్ లో భూకంపం: సౌదీ పౌరులు క్షేమం..!
- May 28, 2023
టోక్యో: తూర్పు జపాన్‌ను తాకిన భూకంపంలో సౌదీ పౌరులందరు క్షేమంగా ఉన్నారని, వారి భద్రతపై స్థానిక జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని జపాన్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలియజేసింది. విపత్తులకు సంబంధించి స్థానిక అధికారులు జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండాలని రాయబార కార్యాలయం పౌరులకు పిలుపునిచ్చింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, సౌదీ పౌరులు తప్పనిసరిగా సౌదీ వ్యవహారాలను నంబర్ (09055833862) ద్వారా సంప్రదించాలని సూచించింది. NHK ప్రకారం.. టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్‌లో శుక్రవారం సాయంత్రం 7:03 గంటలకు 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ సునామీ ముప్పు లేదని పేర్కొంది. అయితే భూకంప కేంద్రం చిబా తూర్పు తీరంలో, 50 కిలోమీటర్ల లోతులో ఉందని అంచనా వేసింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







