శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

- May 28, 2023 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుకున్న సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు హైదరాబాద్ నుండి షార్జా వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికు ర్యాలీ వద్ద ఈ విదేశీ కరెన్సీని గుర్తించిన అధికారులు. కరెన్సీ స్వాధీనం చేసుకుని నిందితురాలని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.శుక్రవారం అర్ధరాత్రి జి9-459, విమానంలో షార్జా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయంకు వచ్చిన అరబ్ దేశస్తురాలు జాయిన్ అల్నిసా మహమ్మద్ క్యూమర్ అల్దీన్ (60).

అయితే ఆమె కదిలికలను గమనించిన సిఐఎస్‌ఎఫ్ ఏఎస్‌ఐ సంపత్ రావు అదుపులోకి తీసుకున్నాడు. ఆమె హైడ్ బాగేజీ తనిఖీ చేయగా అందులో 44,480 (మొత్తం 54 నోట్లు) యూఏఈ దిర్హాములు కనిపించాయి. అయితే కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు. కరెన్సీ తో పాటు నిందితురాలని విమానాశ్రయం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితురాలని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com