APNRTS కువైట్, కో-ఆర్డినేటర్ల సామాజిక సేవలు అభినందనీయం: డైరెక్టర్ ఇలియాస్
- May 28, 2023
కువైట్ సిటీ: ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లా రేణిగుంట కు చెందిన రాఘవయ్య శోభన్ బాబు, 2018వ సంవత్సరం, డిసెంబర్ నెలలో, జీవనోపాధి కొరకు సముద్రములో బోట్లు రిపేరు పని చేసేందుకు కువైట్ వచ్చినాడు. దురదృష్టం కొద్దీ ప్రమాదవశాత్తూ, 2019 జూన్ లో , రోడ్డు దాటుతుండగా కార్ ఢీకొనడంతో, తలకు గాయాలై సుమారు 2 సంవత్సరాలుగా, జాబ్రీయా ప్రాంతములో ఉన్న ముబారక్ అల్ కబీర్ ఆసుపత్రిలో చేరి కోమాలో ఉన్నాడు. కోమా నుండి బయటికి వచ్చిన తర్వాత (అపస్మారక స్థితి ) జహార ప్రాంతములో ఉన్న జహరా ఆసుపత్రిలో గత 2 సంవత్సరాలుగా చికిత్స పొందుతున్నాడు.
ఈ సంధర్భంగా ఏపీఎన్ఆర్టిఎస్ డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్. కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, మాట్లాడుతూ, రాఘవయ్య విషయం, కువైట్ రీజినల్ కో-ఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి దృష్టికి తీసుకురాగ వెంటనే స్పందించి భారత రాయబార కార్యాలయ అధికారులతో మరియు ఏపీఎన్ఆర్టిఎస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్ తో మాట్లాడి త్వరలో స్వదేశానికి పంపిస్తానని మహేష్ తెలిపారు.
ఈ సంధర్భంగా నాయని మహేష్ రెడ్డి ఏపీఎన్ఆర్టీఎస్, ద్వారా చేస్తున్న సేవలకు హార్షం వ్యక్తం చేస్తూ కమిటీ సభ్యులు అభినందించారు. రాఘవయ్య అన్న మధు బాబు మాట్లాడుతూ నా తమ్ముడికి ప్రమాదం జరిగిన తర్వాత కువైటీ వాడు విజిట్ విజ తీసి పంపితే 6 నెలలు ఉండి పోయి మరొక్కసారి రెండు నెలల క్రితం కువైట్ వచ్చినాను. మాది చాల పేద కుటుంబం నేను ఆటో నడుపుతున్నాను, మా తమ్ముడు కువైట్ వచ్చినాక మా బ్రతుకులు బాగు పడతాయి అనుకున్నాము దురదృష్టం కొద్దీ ఇలా జరగడం విధి రాత, దేశం కానీ దేశంలో ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలు తెలుగు వారికి ఒక వరం అని. మాకు అన్నివిధాలా సహకరిస్తున్న నాయని మహేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఏపిఎన్ఆర్టీఎస్ ద్వారా NRI'స్ సమస్యలు పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి, ఛైర్మన్ మేడపాటి వెంకట్, సీఈఓ హేమలత, ఇలియాస్, బాలిరెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ. గతంలో నేను కువైట్ వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఉచితంగా భోజన వసతి కల్పించిన మాధవి హోటల్ యజమాని విజయ్ కుమార్ రెడ్డి కి మరియు నా తమ్ముడిని చూసేందుకు వచ్చిన ఏపీఎన్ఆర్టీఎస్ మరియు కువైట్ వైఎస్సార్సిపీ సభ్యులు మానవత్వంతో సుమారు 60 దినార్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి.నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏ.లాజరాజ్, మీడియా ఇంచార్జ్ పి . సురేష్ రెడ్డి, రెడ్డయ్య, మణి , గోపాల్ రెడ్డి,శేఖర్, విజయ్ రెడ్డి, గడ్డం మోహన్ తదితరులు పాల్గోన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









