వాట్సాప్‌లో ఖాతా నిర్వహణపై ‘జవాజత్’ క్లారిటీ
- May 28, 2023
రియాద్: వాట్సాప్ అప్లికేషన్‌లో అధికారిక ఖాతాకు సంబంధించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) క్లారిటీ ఇచ్చింది. వాట్పాప్ లో ఎలాంటి ఖతాను నిర్వహించడం లేదని జవాజత్ తెలిపింది. మోసపూరిత వెబ్‌సైట్‌లు, నకిలీ, అనుమానాస్పద ఖాతాలతో వారి పేర్లను అనుకరిస్తూ, లబ్ధిదారులకు సేవలు అందిస్తామంటూ ప్రచారంలో ఉన్న వాటిని నమ్మొద్దని జవాజాత్ ప్రతి ఒక్కరినీ హెచ్చరించింది. సేవల నుండి ప్రయోజనం పొందాలనుకునే,.. సమాచారం, వార్తలను స్వీకరించాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా జవాజాత్ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను సందర్శించాలని కోరింది. జవాజాత్ ఇన్ఫోగ్రాఫిక్‌లో తన ఖాతా పేరు "@AljawazatKSA" అని, ఇదే పేరుతో ఇన్స్టా గ్రామ్, స్నాప్ షాట్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ లలో అకౌంట్ ఉందని వివరించింది. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడానికి, వారి విచారణలకు సమాధానమివ్వడానికి పేర్కొనబడిన ట్విట్టర్(@CareAljawazat)లో తన రెండవ అధికారిక ఖాతా ఉందని తెలిపింది. అధికారిక ఇమెయిల్ [email protected] , అధికారిక వెబ్‌సైట్: www.gdp.gov.sa అని జవాజాత్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









