ఎమర్జెన్సీ సీట్ల విక్రయాన్ని నిలిపివేసిన ఏషియానా ఎయిర్‌లైన్స్
- May 28, 2023
యూఏఈ: ఒక ప్రయాణీకుడు గాలిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరిచిన ప్రమాదం కారణంగా దక్షిణ కొరియాకు చెందిన ఏషియానా ఎయిర్‌లైన్స్ కొన్ని ఎమర్జెన్సీ సీట్ల విక్రయాన్ని నిలిపివేసినట్లు క్యారియర్ ఆదివారం తెలిపింది. సియోల్‌కు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు (149 మైళ్లు) దూరంలో ఉన్న డేగు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రన్‌వే వద్దకు చేరుకున్నప్పుడు దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న A321-200 విమానంలో ఈ సంఘటన జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే, విమానయాన భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తిని డేగులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







