IIFA-2023: లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న కమల్ హాసన్
- May 28, 2023
అబుధాబి: బాలీవుడ్లో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA-2023) వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. అబుధాబిలో ఇరవై మూడవ ఐఫా అవార్డుల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
విక్రమ్ వేద సినిమాకు గానూ హృతిక్ రోషన్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఉత్తమ నటిగా అలియాభట్ ఎంపికైంది. గంగూబాయి కతియావాడి సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ ఎంపికయ్యారు. ఈ అవార్డుల వేడుకకు అలియా రాకపోవడంతో ప్రముఖ నిర్మాత జయంతీలాల్ ఈ అవార్డును స్వీకరించారు. ఉత్తమ చిత్రంగా దృశ్యం-2 నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గానూ కమల్ హాసన్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా పురస్కారాన్ని అందుకున్నారు.
ఉత్తమ చిత్రం-దృశ్యం -2
ఉత్తమ దర్శకుడు-ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
ఉత్తమ నటుడు- హృతిక్ రోషన్ (విక్రమ్ వేద)
ఉత్తమ నటి-అలియా భట్ (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ సహాయ నటుడు-అనిల్ కపూర్ (జగ్ జగ్ జియో)
ఉత్తమ సహాయ నటి-మౌని రాయ్(బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ తొలి చిత్ర నటుడు-శంతను మహేశ్వరి (గంగూబాయి కతియావాడి) మరియు బాబిల్ ఖాన్ (ఖలా)
ఉత్తమ తొలి చిత్ర నటి-ఖుషాలి కుమార్ (ధోఖా: రౌండ్ డి కార్నర్)
ఉత్తమ కథ-జస్మీత్ కె రీన్ మరియు పర్వీజ్ షేక్ (డార్లింగ్స్)
ఉత్తమ ఎడిటింగ్-సందీప్ ఫ్రాన్సిస్ ( దృశ్యం -2 )
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్-(బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ స్క్రీన్ప్లే-(గంగూబాయి కతియావాడి)
ఉత్తమ సంభాషణలు-(గంగూబాయి కతియావాడి)
ఉత్తమ కొరియోగ్రఫి-సీజర్ గోన్సాల్వేస్, బోస్కో మార్టిన్స్ (భేదియా)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్-మోనికా ఓ మై డార్లింగ్
ఉత్తమ నేపథ్య గాయకుడు-అరిజిత్ సింగ్ (కేసరియా -బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ నేపథ్య గాయకురాలు-శ్రేయా ఘోషల్ (కేసరియా -బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ)
ఉత్తమ నేపథ్య సంగీతం-విక్రమ్ వేద
ఉత్తమ సంగీతం-ప్రీతమ్ చక్రవర్తి (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ సాహిత్యం-అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ)
ఉత్తమ అడాప్టెడ్ కథ-అమీల్ కీయన్ ఖాన్ మరియు అభిషేక్ పాథక్ ( దృశ్యం -2 )
రీజనల్గా మంచి విజయం సాధించిన సినిమాగా రితీష్ దేశ్ముఖ్ మరియు జెనీలియా డిసౌజా (వేద్)
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ అచీవ్మెంట్-కమల్ హాసన్.





తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







