ఏపీ అసెంబ్లీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో విడుదల...
- May 28, 2023
అమరావతి: భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ఏపీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీలోని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు.
మహిళల కోసం మహాశక్తి, యువత కోసం యువగళం, రైతుల కోసం అన్నదాత పేరిట పలు పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. అలాగే, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ పేరిట మరో మూడు కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు.
భవిష్యత్తుకు గ్యారెంటీలోని అంశాలు..
మహిళల కోసం మహాశక్తి
ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో..
18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి యువతి, మహిళకు ఆడబిడ్డ నిధి
జిల్లా పరిధిలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం
తల్లి వందనం కింద ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు
ఎంత మంది పిల్లలు ఉన్నా ఓకే.. స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు
కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా ఆర్థిక సహాయం
దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
20 లక్షల మందికి ఉద్యోగాలు
ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి
రిచ్ టు పూర్ కింద పేదలను సంపన్నులను చేయడం
5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు
బీసీలకు రక్షణ చట్టం కింద వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది టీడీపీ
ఇంటింటికి నీరు కింద మంచి నీరు అందించడం. పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్
అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్‌లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









