అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

- May 29, 2023 , by Maagulf
అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్‌పైగురి మార్గంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. మొదటి ఈశాన్య వందే భారత్ రైలును ప్రారంభించడం వల్ల పర్యాటక రంగానికి ఊతమిస్తుందని, ఈశాన్య ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచుతుందని భావిస్తున్నామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. 2016లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకముందు అభివృద్ధి శూన్యంగా ఉండేదని చెప్పారు.

ఈ రైలు గౌహతి -న్యూ జల్పాయిగురి మధ్య 411 కి.మీ దూర రైలు ప్రయాణాన్ని 5 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన రైలు. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ వారానికి ఆరు రోజులు నడుపుతామని రైల్వే అధికారులు చెప్పారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఒక్కొక్కటి 52 సీటింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com