"24 సినిమాకు ప్రీక్వెల్"

- May 11, 2016 , by Maagulf

24 సినిమా ఒకెత్తు. అందులో ఆత్రేయ పాత్ర మరో ఎత్తు. క్రూరమైన విలనిజం పండించాడు సూర్య ఆ పాత్రలో. ఆ పాత్ర స్క్రీన్ పై కనిపించినపుడు 'ఏం చేస్తాడ్రాబాబు?" అనే ఫీలింగ్ ప్రేక్షుకుల్లో కలుగుతుంది. ఇప్పుడు ఈ పాత్రను బేస్ చేసుకొని ఈ సినిమాకి ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు.. "24 సినిమాకు ప్రీక్వెల్ వుంది. అల్రెడి స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. ప్రీక్వెల్ చేయడానికి కారణమేమంటే ఆత్రేయ ఆ వాచ్ ను ఎందుకు కావాలని అనుకున్నాడు. అసలు ఆత్రేయ కధ ఏమిటి. ఇప్పుడు చెప్పిన కథకు ముందు ఏం జరిగింది" ఈ పాయింట్స్ ను బేస్ చేసుకుని ప్రీక్వెల్ ఉటుంది"అని చెప్పుకొచ్చాడు విక్రమ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com