జూన్ 4 నుండి 7 ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఆటోమేటిక్ నిఘా
- May 30, 2023
రియాద్ : సౌదీ అరేబియా జూన్ 4 నుండి అమలులోకి వచ్చే ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఆటోమేటిక్ నిఘాను ప్రవేశపెట్టనుంది. దీనిని పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అల్ బస్సామి ప్రకటించారు.ఎలక్ట్రానిక్‌గా ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనల ఆటోమేషన్‌ను అల్ బస్సామి సోమవారం ప్రారంభించారు. ఈ ఉల్లంఘనలలో డ్రైవింగ్ అనుమతించబడని ఫుట్ పాత్ లేదా పాదచారుల మార్గాల్లో డ్రైవింగ్, రాత్రి సమయంలో వితౌట్ లైట్ డ్రైవింగ్, మల్టీ-లేన్ రహదారిపై డ్రైవింగ్, అస్పష్టమైన లేదా దెబ్బతిన్న నంబర్ ప్లేట్‌లతో డ్రైవింగ్, వాహనాన్ని నిర్దేశించని ప్రదేశాలలో పార్కింగ్ చేయకపోవడం లాంటి ఉల్లంఘనలను నిఘా కెమెరాల ద్వారా రికార్డుచేయనున్నారు. సాధారణ ట్రాఫిక్ విభాగం మరియు రోడ్డు భద్రత కోసం ప్రత్యేక దళాలు ఈ ఉల్లంఘనలపై నిఘా నిర్వహిస్తాయి. ఇది ట్రాఫిక్ నియంత్రణ, భద్రత స్థాయిని పెంచడం.. కింగ్డమ్ అంతటా నగరాల లోపల మరియు వెలుపల పబ్లిక్ రోడ్ల వెంబడి అవాంఛనీయ ప్రవర్తనను తగ్గించే లక్ష్యంతో వస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







