ఓపెన్ హౌజ్: కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలిపిన భారత రాయబారి
- May 30, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం మే 26న ఓపెన్ హౌస్‌ను నిర్వహించింది. దీనికి రాయబారి పీయూష్ శ్రీవాస్తవ అధ్యక్షత వహించారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఓపెన్ హౌస్‌లో 60 మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ పర్యటన సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు కమ్యూనిటీకి రాయబారి శ్రీవాస్తవ కృతజ్ఞతలు తెలిపారు. గత ఓపెన్ హౌజ్ లో లేవనెత్తిన చాలా సమస్యలకు పరిష్కారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ, సహకారాలు అందించిన స్థానిక అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనేక కాన్సులర్ మరియు కార్మిక సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసినందుకు భారతీయ సమాజం, సంస్థలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది భారతీయ కార్మికులు ఎంబసీ జోక్యంతో..లేబర్ మార్కెటింగ్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సహకారంతో భారతదేశానికి తిరిగి వెళ్లారని గుర్తుచేశారు. ICWF ద్వారా అవసరమైన వ్యక్తులకు అత్యవసర ధృవీకరణ పత్రాలు, టిక్కెట్‌లను మంజూరు చేయడంతోపాటు, బోర్డింగ్, వసతిని అందించడం ద్వారా గృహిణులతో సహా బాధలో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేయడం కొనసాగించిందన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







