నితిన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్.! ఈ సారి మూవులుగా వుండదు.!
- May 30, 2023
‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో బొత్తిగా నవ్వుల పాలైపోయాడు నితిన్. అంత కాదు ఇంత కాదు.. అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. రిలీజ్ తర్వాత రిజల్ట్ తుస్సుమనిపించారు.
ఇక, ఇప్పుడు ఇంకో కొత్త సినిమాతో వస్తున్నాడు నితిన్. వక్కంతం వంశీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ ఓ హీరోకి వీరాభిమానిగా నటించడమే కాదు, తెరపై తనను తాను చూసుకోవడానికి తెగ తహతహలాడిపోయే ఓ జూనియర్ ఆర్టిస్టుగా కనిపించబోతున్నాడట.
తాను అభిమానించే హీరోగా రియల్ ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్‌నే ఈ సినిమా కోసం ఓ గెస్ట్ రోల్‌లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం కూడా వుంది.
ఇక, ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ టోన్‌లో తెరకెక్కిస్తున్నాడట వక్కంతం వంశీ. జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్ చేసే అల్లరి అంతా ఇంతా కాదట. చాలా చాలా ఫన్నీగా వుండబోతోందని అంటున్నారు.
చూడాలి మరి, ‘మాచర్ల’తో వేయించుకున్న మచ్చ ఈ సినిమాతో చెరిపేసుకుంటాడేమో నితిన్.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







