‘మేమ్ ఫేమస్’.! ఇదెక్కడి పంచాయితీరా బాబూ.!
- May 30, 2023
మా సినిమా సూపర్ హిట్టూ.. బంపర్ హిట్టూ.. కానీ కావాలని కొన్ని గ్రూపులు సోషల్ మీడియా వేదికగా సినిమాని నెగిటివ్ చేస్తున్నారంటూ ‘మేమ్ ఫేమస్’ టీమ్ గగ్గోలు పెడుతోంది.
రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. యూత్ ఫుల్ ఎంటర్‌టైనరే. కాదనలేం. కానీ, కంటెంట్ వుంటే, సినిమా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లిపోతుంది నో డౌట్.
కానీ, మా సినిమా బాగానే వుంది. కానీ, కావాలని బ్యాడ్ చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ ఏడ్వడమేంటీ.? ఇదెక్కడి గోలరా బాబూ.!
ఈ రోజుల్లో స్టార్ కాస్టింగ్, బడ్జెట్ స్పాన్‌తో పని లేకుండా, కంటెంట్ గట్టిగా వుంటే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేస్తున్నారు. భాషతో కూడా సంబంధం లేదు. డబ్బింగ్ గిగ్గింగ్.. ఇలాంటి తేడాలు కూడా లేవ్. అలాంటప్పుడు, మా సినిమా హిట్టు.. అని సినిమా యూనిట్టే చెప్పుకోవడం.. ఎవరో బ్యాడ్ చేస్తున్నారంటూ ఏడుపులు పెడబొబ్బులు పెట్టడం ఇదెక్కడి సిత్రం.! అంటూ ‘మేమ్ ఫేమస్’ సినిమా యూనిట్ తీరుపై సినీ జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







