తాను చనిపోయినట్లు కొంతమంది దుష్ప్రచారం : వేణుమాధవ్
- May 12, 2016
తాను చనిపోయినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను వేణుమాధవ్ కలిశారు.తాను మరణించానంటూ ఓ టెలివిజన్ చానెల్‌తోపాటు పలు వెబ్‌సైట్లలో వచ్చిన వార్తలను ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఖండించిన సంగతి తెలిసిందే. మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో వేణుమాధవ్ తీవ్ర మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో వేణుమాధవ్ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు చానెల్, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వెబ్‌సెట్లలో వేణుమాధవ్ మృతి చెందిన్నట్లు వచ్చిన వార్తలు వెలువడటం సినీ పరిశ్రమ వర్గాలను, అభిమానులను ఆందోళన గురిచేశాయి.తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆయన వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. గతవారం తన అభిమాన నటులు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







