ప్రబాస్ సినిమాలో లోక నాయకుడా.! నిజమేనా.?
- May 31, 2023
ప్రబాస్ సినిమా అంటే చాలు.. అన్ని రకాలా బిగ్ స్కేల్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు మేకర్లు. నిజానికి ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ మార్కెట్ అయితే భారీగా పెరిగిపోయింది. కానీ, ఆ మార్కెట్‌ని రీచ్ అవ్వడంలో ఎంత మేర సక్సెస్ అవుతున్నాడు ప్రబాస్ అనేది చూస్తున్న సంగతే.
అయినా కానీ, మేకర్లు తగ్గడం లేదు. బడ్జెట్‌తో పాటూ, కాస్టింగ్ కూడా కాస్ట్‌లీగానే వుంటోంది. ఇక, ప్రస్తుతం ప్రబాస్ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ అనే ప్యాన్ ఇండియా మూవీ వున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర నటులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ గాసిప్ బిగ్ బ్రేకింగ్‌లా చక్కర్లు కొడుతోంది. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారన్నది ఆ గాసిప్ సారాంశం.
‘విక్రమ్’ సినిమాతో కమల్ హాసన్ ఈ వయసులోనూ తన సత్తా ఏంటో చూపించారు. అలాంటి కమల్ హాసన్, ప్రబాస్ సినిమాలో కనిపిస్తాడంటే, ఖచ్చితంగా సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తాయ్. కేవలం ఇది సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు స్ర్పెడ్ అవుతున్న గాసిప్పా.? లేదంటే నిజంగానే విశ్వ నటుడు కమల్ హాసన్, ‘ప్రాజెక్ట్ కె’లో కనిపిస్తాడా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!







