ఈ లక్షణాలుంటే ఫ్యాటీ లివర్ వున్నట్లే.! జర భద్రం సుమా.!
- May 31, 2023 
            ఇటీవలి కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అందుకు కారణం నేటి లైఫ్ స్టైలే. ఎక్కువగా ఎలక్ర్టానిక్ డివైజ్‌లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు ఇలా అనేక రకాల కారణాలు ఫ్యాటీ లివర్ ఫేషెంట్లను పెంచేస్తున్నాయ్.
అసలు ఫ్యాటీ లివర్ అంటే.. కాలేయం చుట్టూ అసాధారణ కొవ్వు పెరిగిపోవడమే. ఫ్యాటీ లివర్ కారణంగా అసాధారణ కడుపులో నొప్పి, ఆకలి మందగించడం, కాళ్లలో వాపులు, నీరసం, వికారం తదితర లక్షణాలు ఇబ్బంది పెడుతుంటాయ్.
ఆరంభంలోనే ఫ్యాటీ లివర్‌ని గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి ముదిరితే, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుందని హెచ్చరిస్తున్నారు.
అయితే, దీన్నుంచి తప్పించుకోవాలంటే, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుండిపోవడం, శరీరానికి కదలిక లేకుండా చేయడం వంటి చేయకూడదు. అలాగే ఆల్కహాల్ అలవాటున్న వాళ్లు పూర్తిగా నియంత్రించాలి. ధూమపానం కూడా వదిలేయాలి. జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు పోకూడదు. ఫ్రైడ్ ఐటెమ్స్ ఆహారంలో తగ్గించాలి.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







