137 సంస్థలపై 65.9 మిలియన్ దిర్హామ్ల జరిమానా
- June 02, 2023
యూఏఈ: 2023 మొదటి త్రైమాసికంలో మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ (AML/CFT) చట్టం నిబంధనలు పాటించని సంస్థలపై యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ జరిమానాలు విధించింది. నాన్-ఫైనాన్షియల్ బిజినెస్ లేదా ప్రొఫెషన్స్ (DNFBP) విభాగంలో పనిచేస్తున్న 137 కంపెనీలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ Dh65.9 మిలియన్ల విలువైన జరిమానాలను విధించింది. మనీలాండరింగ్ నిరోధకం, ఉగ్రవాదం, చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం, దాని కార్యనిర్వాహక నిబంధనలు, సంబంధిత చట్టాలను ఎదుర్కోవడంపై 2018 ఫెడరల్ డిక్రీ-లా నెం. 20 ద్వారా నిర్దేశించబడిన నిబంధనలను ఆయా సంస్థలు ఉల్లంఘించాయని మినిస్ట్రీ ఆఫ్ కంట్రోల్ అండ్ ఫాలో-అప్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్లా సుల్తాన్ అల్ ఫ్యాన్ అల్ షమ్సీ తెలిపారు. మొత్తం 137 సంస్థలలో 831 ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







