‘పరేషాన్’కి అలా కలిసొచ్చింది.!
- June 02, 2023
'మసూద’ సినిమాతో గతేడాది గుర్తింపు తెచ్చుకున్న హీరో తిరువీర్. ఈ కుర్రోడి రెండో ప్రయత్నమే తాజా మూవీ ‘పరేషాన్’. ఏమంత పెద్ద హైప్ క్రియేట్ కాలేదు ఈ సినిమాపై. ఇదే రోజు తేజ ‘అహింస’ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే, ‘స్వాతిముత్యం’ సినిమాతో ఆకట్టుకున్న బెల్లంకొండ సోదరుడు ‘నేను స్టూడెంట్ సర్’ అంటూ ఇదే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
అయితే, ఈ రెండు సినిమాలకీ టాక్ అంతంత మాత్రంగానే వచ్చింది. ఇక ముచ్చటగా మూడో సినిమా అయిన ‘పరేషాన్’ ఓ మోస్తరు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అందుకు కారణం ఈ సినిమాకి తెలంగాణా సెంటిమెంటే.
ఈ మధ్య తెలంగాణా యాసలో వస్తున్న సినిమాలు కంటెంట్‌తో సంబంధం లేకుండానే హిట్ టాక్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోకే ‘పరేషాన్’ మూవీ కూడా వస్తుంది.
చాలా రొటీన్ లవ్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘పరేషాన్’కి యూత్‌లో ఆదరణ దక్కుతోంది. రూపక్ రొనాల్డ్ సన్ ఈ సినిమాని ఎక్కడా అతికి పోకుండా చాలా సింపుల్‌గా తెరకెక్కించాడు. సెంటిమెంట్ ఏదైతేనేం, ఎలాగూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, హాలీడే సీజన్‌ని ‘పరేషాన్’ యూజ్ చేసుకోగలదేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







