ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘పెదకాపు’.!
- June 02, 2023
కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఎందుకో తెలీదు ఒకింత ఆసక్తి కలిగిస్తుంటాయ్. ఆ కోవకు చెందిందే ‘పెదకాపు’ సినిమా. కాస్టింగ్ తెలీదు. కానీ, పోస్టర్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా వుంది.
ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే శ్రీకాంత్ అడ్డాల. ఈయన సినిమాలకు ఓ ప్రత్యేకత వుంటుంది. ఫ్యామిలీ సినిమాలను సమర్ధవంతంగా తెరకెక్కించడంలో ఈయనకు సాటి ఈయనే అని చెప్పొచ్చు.
ఇద్దరు స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’వంటి సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే, ఆ తర్వాత శ్రీకాంత్ సినిమాలకు ఆదరణ కరువయ్యిందనుకోండి.
‘అఖండ’ సినిమాతో ఓ రేంజ్ లాభాలు అందుకున్న నిర్మాత రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.
90ల నాటి బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా రూపొందబోతోందనీ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ బట్టి తెలుస్తోంది. ఫస్ట్ లుక్ చాలా ప్రామిసింగ్‌గా వుంది. కథ, కథనం కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ‘ఓ సామాన్యుడి సంతకం’ పెదకాపు.. అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ సినీ జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







