భారీ ఇసుక తుఫాను.. ఒకరి మృతి, 5 మందికి గాయాలు

- June 03, 2023 , by Maagulf
భారీ ఇసుక తుఫాను.. ఒకరి మృతి, 5 మందికి గాయాలు

యూఏఈ: ఈజిప్ట్ రాజధానిని విధ్వంసకర ఇసుక తుఫాను అస్తవ్యస్తం చేసింది. ప్రధాన రహదారిలో బిల్‌బోర్డ్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. 20 మిలియన్ల జనాభా ఉన్న కైరో పట్టణం తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. ఇసుక తుఫాన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూయజ్ కెనాల్‌లోని ఓడలను చుట్టుముట్టే భయంకరమైన మేఘాలు, రోడ్లపై తుఫాన్ ధాటికి దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోవడం వీడియోలలో స్పష్టంగా కనిపించింది.

ఇసుక తుఫానులు వసంతకాలంలో ఈజిప్ట్‌ను క్రమం తప్పకుండా దెబ్బతీస్తాయని, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తీవ్రమైన గాలులు,  ఇసుక తుఫానుతో పాటు వచ్చే ఎత్తైన అలల కారణంగా అధికారులు సూయజ్ కెనాల్ వెంబడి రెండు ఓడరేవులను మూసివేశారు.

2021లో ఇదే విధమైన తుఫాను సమయంలో ఎవర్ గివెన్ అనే జెయింట్ కంటైనర్ షిప్ సూయజ్ కెనాల్ మధ్యలో నిలిచి వాణిజ్య నౌకలకు తీవ్రంగా నష్టం కలిగించిన విషయం తెలిసిందే.  ఈజిప్ట్ అరబ్ ప్రపంచంలో అత్యధిక జనాభా(105 మిలియన్లు) కలిగిన దేశంగా ప్రఖ్యాతి చెందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com