నిఖిల్ స్పీడు మామూలుగా లేదుగా.!
- June 03, 2023
కుర్ర హీరో నిఖిల్ జోరు మామూలుగా లేదు. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఓకే చేస్తూ, వరుసగా అనౌన్స్‌మెంట్లు కూడా ఇచ్చుకుంటూ పోతున్నాడు.
నిఖిల్ చేయబోయే ప్రాజెక్టులన్నీ సరికొత్త ప్రాజెక్టులే. ప్యాన్ ఇండియా ప్రాజెక్టులే. కథల ఎంపికలో చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు నిఖిల్.
ఇప్పటికే ‘కార్తికేయ 2’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. త్వరలో ‘స్సై’ అంటూ మరో సారి ప్యాన్ ఇండియాని టచ్ చేయనున్నాడు.
‘ది ఇండియా హౌస్’ అంటూ అదీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. తాజాగా మరో కొత్త ఎపిక్‌తో రాబోతున్నాడు. అదే ‘స్వయంభు’ సినిమా. ఇదో ఎపిక్ ప్యాంటసీ మూవీ. కానీ, ఇది కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్టే అని తెలుస్తోంది.
చూస్తుంటే మనోడు ఎంచుకున్న కథల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా ఇక అంతే సంగతి. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. త్వరలోనే రామ్ చరణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను సైతం బీట్ చేసేసినా చేసేస్తాడేమో.!
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







