ఆశాజనకంగా యూఏఈ జాబ్ మార్కెట్..!

- June 03, 2023 , by Maagulf
ఆశాజనకంగా యూఏఈ జాబ్ మార్కెట్..!

యూఏఈ: 2023 మొదటి త్రైమాసికంలో యూఏఈ జాబ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రత్యేకించి కొన్ని రంగాలలో 20 శాతం పెరుగుదలతో అద్భుతమైన పురోగతిని సాధించాయి. రిక్రూటర్ల ప్రకారం.. దుబాయ్ ఆర్థికంగా ఎదుగుతూనే ఉందని, రిక్రూట్ మెంట్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. కొత్త ప్రాజెక్టులు, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాల ద్వారా ఇది సాధ్యమవుతుందని మార్క్ ఎల్లిస్‌లో జనరల్ మేనేజర్ అవ్స్ ఇస్మాయిల్ చెప్పారు. యూఏఈ ప్రభుత్వం చేపట్టిన డిజిటలైజేషన్ కూడా తమ వ్యాపార విస్తరణకు దోహదం చేసిందన్నారు. గత కొంత కాలంగా విదేశీ పెట్టుబడులు కూడా పెరిగాయని, 2023 చివరి వరకు ఇదే ఊపు కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా నైపుణ్యం, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ మరియు డిజిటల్ పరివర్తనపై దృష్టి సారించే వారికి డిమాండ్ ఉందన్నారు.

గ్లోబల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ రాబర్ట్ వాల్టర్స్ ఇటీవలి నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. ఐటీ పరిశ్రమ ఉద్యోగ ఖాళీలలో 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  హెచ్‌ఆర్ రంగం గౌరవప్రదమైన 10 శాతం పెరుగుదలను నమోదుచేసింది. ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్, IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, IT ఇంజనీర్, DevOps ఇంజనీర్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగాలకు డిమాండ్ ఉందన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com