అనసూయా.! ఈ వయసులో నీకిది అవసరమా.?
- June 05, 2023
బుల్లితెర నుంచి పెద్ద తెరపైకి వచ్చి విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. వయసుతో సంబంధం లేకుండా అనసూయ గ్లామర్‌కి పిచ్చెక్కి చచ్చపోయే నెటిజనం వున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ క్రేజ్‌తో సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ మరింత క్రేజ్ పెంచుకుంటూ పోతోంది అనసూయ భరద్వాజ్. అలాగే, సోషల్ మీడియాలో అమ్మడికున్న క్రేజ్‌కి స్టార్ హీరోయిన్లు సైతం దిగదుడుపే అనడం అతిశయోక్తి అనిపించుకోదేమో.
అలాగే అనసూయ ఆంటీకి కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంలోనూ కూసింత ఆసక్తి ఎక్కువే. తాజాగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది అనసూయ భరద్వాజ్.
తన ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలవి. పొట్టి పొట్టి దుస్తుల్లో విచ్చలవిడిగా గ్లామర్ ఒలకబోయడమే కాకుండా భర్త భరద్వాజ్‌తో గాఢమైన లిప్ లాక్ కూడా లాగించేసింది అనసూయ.
ఈ లిప్ లాక్ ఫోటోనే ఇప్పుడు ట్రోలింగ్‌కి గురవుతోంది. అనసూయా నీకింత అవసరమా.? మరీ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావ్.! అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవరేమైనా అనుకోనీ.! నేనింతే.! అంటూ మీడియాకి తగినంత స్టఫ్ ఇస్తూనే వుంటుందిలా అనసూయ.
అన్నట్లు అనసూయ నటించిన తాజా సినిమా ‘విమానం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందండోయ్.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







