‘బాస్ బ్యూటీ’కి ఇంకో ఛాన్స్ ‘బ్రో’.?

- June 05, 2023 , by Maagulf
‘బాస్ బ్యూటీ’కి ఇంకో ఛాన్స్ ‘బ్రో’.?

‘బాస్ పార్టీ..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పక్కన ఐటెం స్టెప్పులిరగదీసేసిన అందాల బొమ్మ ఊర్వశి రౌతెలా. హీరోయిన్‌ కావాల్సిన ఈ అమ్మడు, కేవలం స్పెషల్ సాంగ్స్‌తోనే సరిపెట్టుకోవల్సి వస్తోంది.

మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా తర్వాత రవితేజతోనూ ఓ సినిమాలో స్సెషల్ సాంగ్ చేసింది. అలాగే, రామ్ - బోయపాటి సినిమాలోనూ స్సెషల్ సాంగ్‌లో దర్శనమివ్వబోతోంది.

ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబో మూవీ ‘బ్రో’ లోనూ ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారట. ఆ సాంగ్ కోసం ఊర్వశి పేరునే పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది.

చూస్తుంటే, స్సెషల్ సాంగ్స్‌లో అమ్మడు టాలీవుడ్‌ని ఏలేసేలా కనిపిస్తోంది. ఇదే అదనుగా ఆమె ఎప్పుడో నటించిన ‘బ్లాక్ రోజ్’ మూవీ కూడా రిలీజ్‌కి సిద్ధమవుతుందేమో చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com