బిఆర్ఎస్ సెంటర్‌కి శంకుస్థాపన చేసిన సిఎం కెసిఆర్
- June 05, 2023
హైదరాబాద్: కోకాపేటలో భారత్ భవన్ కు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.
కోకాపేటలో మొత్తం 11 ఎకరాల్లో మొత్తం 15 అంతస్తుల్లో భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు,శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు బిఆర్ఎస్ కు కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేవలంలో ఐదు రోజుల్లో నే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోకాపేటలో గజం లక్ష రూపాయలకు పైగా పలుకుతుండగా కేవలం రూ. 7500 లకు గజం చొప్పున 11 ఎకరాలను ప్రభుత్వం కట్టబెట్టింది. వందల కోట్ల స్థలాన్ని కేవలం 40 కోట్లకే కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







