ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జన్మదినం: అలరించిన 'మ్యూజిక్ ఇండియా దుబాయ్ గీతాంజలి'

- June 05, 2023 , by Maagulf
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జన్మదినం: అలరించిన \'మ్యూజిక్ ఇండియా దుబాయ్ గీతాంజలి\'

దుబాయ్: దిగ్గజ గాయకుడు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని మ్యూజిక్ ఇండియా దుబాయ్ గీతాంజలి సీజన్ 2 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని జూన్ 4న  దుబాయ్‌ గర్హౌద్ లోని వాయిస్ ఇంటర్నల్ లో నిర్వహించారు. 

మ్యూజిక్ ఇండియా వ్యవస్థాపకురాలు ప్రశాంతి చోప్రా, వ్యవస్థాపక సభ్యుడు రాకేష్ మరింగంటి,  కోర్ సభ్యుడు శ్రీనివాసన్ గోవిందరాజన్ నేతృత్వంలో 32 మంది యూఏఈ గాయకులు SPB ఆలపించిన పాటలను పాడి అలరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాన్సుల్ (ఎకనామిక్, ట్రేడ్ & కామర్స్) డాక్టర్ కె. కాళీముత్తు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ Ln డాక్టర్ ప్రతాని రామ కృష్ణ గౌడ్  హాజరయ్యారు.  

ఈ సందర్బంగా డాక్టర్ కె.కాళీముత్తు మాట్లాడుతూ..  SPB ఓ సంగీత నిధి అని, అతని జ్ఞాపకాలు అమూల్యమైనవని,  భవిష్యత్ తరాల గాయకులు అతని సంగీతాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.  యూఏఈలో సంగీతం & సంస్కృతిని వ్యాప్తి చేయడంలో..  ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో మ్యూజిక్ ఇండియా టీమ్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. డాక్టర్ ఆర్కే గౌడ్ సినిమా పరిశ్రమలో ఎస్పీబీతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దుబాయ్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక నంది అవార్డుల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా యూఏఈలోని భారతీయులందరినీ ఆహ్వానించారు.  టిఎఫ్‌సిసి దుబాయ్ చాప్టర్ దుబాయ్‌లో ప్రారంభించబడిందని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆకాంక్షలు ఉన్న భారతీయులకు ఇది మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని తెనాలి డబుల్ హార్స్ - పప్పులు, M R గ్లోబల్ ఈవెంట్స్ సమర్పించారు. గుడ్ ఎర్త్ (తెనాలి డబుల్ హార్స్ యూఏఈ డీలర్),Attitude Online Store, ASR చార్టర్డ్ అకౌంటెంట్స్,BBG-Your True Wealth, వైఖరి, సాల్వా ఇంటర్నేషనల్, సిల్వర్ ప్యాలెస్ రెస్టారెంట్, పెరుమాళ్ పువ్వులు మద్దతునిచ్చారు. మీడియా పార్టనర్ గా మా గల్ఫ్ మీడియా వ్యవహరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com