బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానా

- June 06, 2023 , by Maagulf
బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానా

బహ్రెయిన్: ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ మార్గదర్శకత్వంలో వీధులు మరియు బహిరంగ ప్రదేశాల్లో జంతువులకు ఆహారం ఇచ్చే వ్యక్తులకు జరిమానా విధించే ప్రచారాన్ని ముహరక్ మునిసిపాలిటీ ప్రారంభించింది. ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ ప్రకారం..  బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానాను విధించనున్నారు. ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఈ నిర్ణయంతీసుకున్నట్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలలో పక్షులు మరియు జంతువులకు ఇచ్చే  ఆహారం మిగిలి పాడై ఈగలు మరియు ఎలుకలు చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయని మున్సిపాలిటీ తెలిపింది. 2019 యొక్క పరిశుభ్రత చట్టం నంబర్ (10) ప్రకారం ఈ చర్యను ఎవరు చేసినా వారికి BD300 జరిమానా విధించబడుతుందని వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com