ఏకీకృత ఆహార చట్టంపై చర్చించిన GCC ఫుడ్ సేఫ్టీ కమిటీ
- June 08, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ అధ్యక్షతన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) ఫుడ్ సేఫ్టీ కమిటీ 7వ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కమిటీలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌లోని ఆహార భద్రతకు సంబంధించిన మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒమన్ సుల్తానేట్ ప్రతినిధిగా వ్యవసాయం, మత్స్య మరియు వ్యవసాయ నీటి వనరుల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అహ్మద్ నాసర్ అల్ బక్రి హాజరయ్యారు. ఈ సందర్బంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏకీకృత ఆహార చట్టంపై చర్చించారు. అదే విధంగా గల్ఫ్ సహకార మండలి కేంద్రం దిగుమతి చేసుకున్న ఆహారంపై నియంత్రణ కోసం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) గైడ్, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటేరియట్ జనరల్‌లో ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఖలీద్ అలీ అల్ సునైదీ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









