దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ వచ్చేసింది
- June 08, 2023
యూఏఈ : ఈద్ అల్ అదా హాలిడే సందర్భంగా ఈవెంట్ రిటర్న్‌గా రాఫెల్స్, షాపింగ్ డీల్స్ వచ్చేసాయి. రాఫెల్‌లు, రిటైల్ ప్రమోషన్‌లు, ఈవెంట్ల స్పెషల్ దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ (DSS) తిరిగి వచ్చింది. ఈవెంట్ 26వ ఎడిషన్ ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ అధా గుర్తుగా ప్రారంభమవుతుంది. నివాసితులు ఆరు రోజుల విరామం పొందే అవకాశం ఉంది. జూన్ 29 నుండి సెప్టెంబర్ 3 వరకు DSS జరుగుతుంది. ఈ ఏడాది ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి క్యాలెండర్ జూన్ 20న ప్రకటించనున్నట్టు దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) ఓ ప్రకటనలో తెలిపింది.ఈసారి ప్రమోషన్‌లలో వివిధ రకాల హోటళ్లలో స్పెషల్ ఆఫర్లు, నగరంలోని మాల్స్ మరియు గమ్యస్థానాలలో ఎర్లీ బర్డ్ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. DSS ప్రారంభ కచేరీలో హుస్సేన్ అల్ జాస్మీ, కడిమ్ అల్ సాహిర్ జూలై 1న కోకాకోలా ఎరీనాలో పాల్గొంటారు. సౌదీ అరేబియా లెజెండ్ మహ్మద్ అబ్డో కూడా మరుసటి రోజు సాయంత్రం జరిగే కోకాకోలా ఎరీనాలో ప్రదర్శన ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







