గార పట్టిన దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలంటే.!
- June 08, 2023దంత సమస్యలన్నీ ఓ ఎత్తు. పళ్లు పసుపు రంగులోకి మారి గార పట్టినట్లుగా కనిపించడం ఇంకో ఎత్తు. అందమైన స్మైల్‌కి ముత్యాల్లా మెరిసే దంతాలూ కీలకమే. గార పట్టిన దంతాలను క్లీన్ చేసుకోవడానికి డెంటిస్ట్ వద్దకు పోతే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని.
ఖర్చు పోతే పోయే.. ఒక్కసారి డెంటిస్ట్ చేతిలో మన గార పళ్లు పడ్డాకా.. వాటికున్న సెన్సిటివిటీ కోల్పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అనేక రకాల దంత సమస్యలు తోడవుతాయ్.
అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ పద్ధతిలోనే గార పట్టిన దంతాలను శుభ్రం చేసుకోవడానికే ఈ స్పెషల్ రెమెడీ. అదేంటో తెలుసుకుందాం పదండి.
ఓ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో అర టేబుల్ స్పూన్ సాల్ట్ కలిపి అందులో రెగ్యులర్‌గా యూజ్ చేసే టూత్ పేస్ట్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని టూత్ బ్రెష్ సాయంతో సున్నితంగా దంతాలను శుభ్రం చేసుకోవాలి.
ఒక్క వాష్‌తోనే చాలా ఫలితం వుంటుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే, దంతాలకు గార పట్టడం అనే సమస్యే వుండదు. ముత్యాల్లా మెరిసిపోవడం ఖాయం.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం