భారత విద్యార్థులకు కెనడా ప్రధాని మద్దుతు

- June 08, 2023 , by Maagulf
భారత విద్యార్థులకు కెనడా ప్రధాని మద్దుతు

కెనడా: నకిలీ పత్రాలు సమర్పించిన దాదాపు 700మంది భారతీయ విద్యార్థులు బహిష్కరణకు గురికానున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్‌ శాఖ కొద్దిరోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత విద్యార్థులు కెనడాలో శాశ్వత నివాసం కల్పించాలంటూ రోడ్లపై ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. బుధవారం జరిగిన పార్లమెంట్‌ చర్చలలో ఆయన భారత విద్యార్థుల గురించి మాట్లాడుతూ.. 'నకిలీ కాలేజీ అడ్మిషన్‌ పత్రాలకు సంబంధించి భారతీయ విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి మాకు తెలుసు. ఈ కేసులో బాధితులైన విద్యార్థులకు జరిమానా విధించకుండా... దీనికి కారణమైన దోషులను గుర్తించే పనిలో ఉన్నాం' అని ఆయన అన్నారు. అలాగే భారత విద్యార్థులకు మద్దతుగా, బహిష్కరణ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కెనడా ఎన్‌డిపి పార్టీకి చెందిన సింగ్‌.. పార్లమెంటులో ఏకగ్రీవ సమ్మతి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ తీర్మానం నకిలీ పత్రాల వల్ల దేశ బహిష్కరణకు గురయ్యే విద్యార్థులను రక్షిస్తుంది.
కాగా, కెనడియన్‌ బోర్డర్‌ సర్వీస్‌ ఏజెన్సీ (సిబిఎస్‌ఎ) ఏడువందల మందికి పైగా భారతీయ విద్యార్థులు తమ విద్యా సంస్థ అడ్మిషన్‌ ఆఫర్‌ లెటర్లు నకిలీవి ఇటీవల గుర్తించింది. అయితే ఇందులో తమ తప్పేమీ లేదని.. ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీనే తమని మోసం చేసిందని భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com