‘గ్లోబల్ లయన్’.! ఇదేం అతి బాలయ్యా.!
- June 09, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీయార్ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. ‘పుష్ప’ మేనియాతో అల్లు అర్జున్ కూడా గ్లోబల్ స్టార్‌గానే గౌరవం దక్కించుకుంటున్నాడు.
మరి, బాలయ్య గ్లోబల్ స్టార్ ఎప్పుడయ్యారు.? ఆయన ఏదైనా ప్యాన్ ఇండియా సినిమాలో నటించారా.. ఇంతవరకూ.? లేదే.! కానీ, బాలయ్య కూడా గ్లోబల్ స్టారేనండోయ్.
ఆయన తాజా సినిమాకి సంబంధించి ఈ విధంగానే పబ్లిసిటీ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో బాలయ్య నటిస్తున్న 108వ సినిమాని ‘గ్లోబర్ లయన్ బాలయ్య’ అనే క్యాప్షన్‌తో ప్రమోట్ చేస్తున్నారు.
గ్లోబల్ లయన్ ఈ క్యాప్షన్ ఎవరిచ్చారట ఆయనకి అంటారా.? జై బాలయ్య.. ఆయనకెవరైనా ఇవ్వాలా చెప్పండి. ఆయనకి ఆయనే ఇచ్చేసుకుంటారంతే.
బాలయ్య 108 సినిమాకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టైటిల్ వదలడానికి ముందుగా సోషల్ మీడియాలో చేసిన హడావిడే గ్లోబల్ లయన్ బాలయ్య. సర్లెండి ఇది టైటిల్ అయితే కాదు.. ‘భగవంత్ కేసరి’ ఇదే బాలయ్య తాజా సినిమా టైటిల్. గుర్తు అట్టేపెట్టుకోండి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







