ఇట్స్ అఫీషియల్.! లావణ్య త్రిపాఠి.. మెగా కోడలైపోతోందోచ్.!
- June 09, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కీ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీకీ మధ్య ఏదో వుందంటూ జరుగుతోన్న ప్రచారానికి చెక్ పడినట్లే అనిపిస్తోంది. జూన్ 9న వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ ఫిక్సయినట్లుగా ఇటీవల తాజా ఖబర్ ఒకటి గట్టిగా వినిపించింది.
ఎప్పటిలాగే కొందరు దాన్నీ లైట్ తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ ఖబర్ నిజమే అని ఓ ప్రెస్ నోట్ రిలీజైంది. ఇంకేముంది.! ఇంతవరకూ గాచిప్స్లో వున్న ఈ జంట యవ్వారం నిజమే అని తేలిపోయింది.
నిజంగానే లావణ్యతో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరగనుంది. లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కానుంది. మొత్తానికి నిప్పు లేనిదే పొగ రాదన్న సామెత వీళ్లిద్దరి విషయంలో నిజమై కూర్చుంది. లవ్వూ, డేటింగ్.. ఇలాంటి ఇష్యూస్ అన్నింటికీ టాటా బైబై చెప్పేసినట్లే.
ఇక సినిమాల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లావణ్య త్రిపాఠి ఇటీవల ‘పులి మేక’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో సందడి చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







