ఉక్రెయిన్‌కు సాయం అందిస్తాం: అమెరికా, బ్రిటన్
- June 09, 2023
అమెరికా: రష్యా చొరబాటుకు తిప్పి కొట్టేందుకు గాను ఉక్రెయిన్‌కు సాయం అందిస్తామని అమెరికా, బ్రిటన్‌లు గురువారం ప్రకటించాయి. అట్లాంటిక్ డిక్లరేషన్ కింద ఇరు దేశాలు ఎదుర్కొంటున్న జాతీయ భద్రత, ఇతర ఆర్థిక భద్రతకు అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించనున్నట్లు ప్రకటించాయి. బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునక్ గురువారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు వైట్ హౌస్‌లోని ఓవెల్ కార్యాలయంలో చర్చలు జరిపారు. కృత్రిమ మేధస్సు (ఎఐ), క్లీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, మినరల్స్‌కు సంబంధించి పరస్పర సహకారం అందించుకుంటామని ప్రకటించారు. డిక్లరేషన్‌లో భాగంగా ఇరువురు నేతలు యూరోపియన్ యూనియన్‌తో సహా కీలక చర్చలు జరిపారు. ముడిసరుకుల దిగుమతులకు సంబంధించి జపాన్‌తో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఉక్రెయిన్ సాయంపై కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్‌కి బ్రిటన్, అమెరికాలు సాయం అందిస్తున్నాయి. ఎఫ్ -16 యుద్ధ విమనాలు అందించడంతో పాటు పైలెట్లకు శిక్షణ ఇస్తామని గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందిస్తామని బైడెన్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







