బహ్రెయిన్ లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవకు ఘనంగా వీడ్కోలు
- June 09, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ సమగ్ర అభివృద్ధికి భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశంసించారు. వివిధ రంగాలలో బహ్రెయిన్-భారత్ సంబంధాల నిరంతర వృద్ధికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రెండు దేశాలు మరియు వారి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవకు ఘనంగా వీడ్కోలు పలికారు.
బహ్రెయిన్‌లో పీయూష్ శ్రీవాస్తవ పదవీకాలం ముగియడంతో మర్యాదపూర్వకంగా ప్రిన్స్ సల్మాన్ ను గుదైబియా ప్యాలెస్‌లో కలిసారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో శ్రీవాస్తవ పోషించిన ప్రశంసనీయమైన పాత్రకు ప్రిన్స్ సల్మాన్ ప్రశంసలు కురిపించారు. రాయబారి తన భవిష్యత్ బాధ్యతలలో విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
అనంతరం ప్రిన్స్ సల్మాన్ కు రాయబారి పీయూష్ శ్రీవాస్తవ తన కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలలో పౌరుల సంక్షేమం కోసం బహ్రెయిన్-భారతదేశ సంబంధాలను పెంపొందించడంలో క్రౌన్ ప్రిన్స్ తిరుగులేని మద్దతు ఇచ్చారని ప్రశంసించారు.
బహ్రెయిన్‌కు తదుపరి రాయబారిగా శ్రీవాస్తవ స్థానంలో కేరళకు చెందిన వినోద్ కె. జాకబ్(2000 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్) ను నియమించారు. ఆయన ప్రస్తుతం శ్రీలంకలోని భారత హైకమిషన్‌లో డిప్యూటీ హైకమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







