రాయబార కార్యాలయంలో విధ్వంసం.. తీవ్రంగా ఖండించిన సౌదీ
- June 09, 2023
రియాద్: సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయ భవనంలో కొన్ని సాయుధ గ్రూపులు జరిపిన విధ్వంసాన్ని సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న సౌదీ సిబ్బంది నివాసాలు, ఆస్తులను ధ్వంసం చేయడంపై మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్య కార్యకలాపాలు శాంతికి చిహ్నాలని, వాటిపై విధ్వంసక చర్యలు సరికావని హితవు చెప్పింది. సుడాన్ ప్రజల భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ సాయుధ సమూహాలను ఎదుర్కోవాలన్న ప్రాముఖ్యతను కూడా ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయని పేర్కొంది.
అలాగే బహ్రెయిన్ రాయబార కార్యాలయం ప్రధాన కార్యాలయం, సూడాన్ రాజధానిలోని రాయబారి ఇంటిపై సాయుధ బృందం దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటనలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి సౌదీ-అమెరికన్ చొరవ తీసుకోవాలని కోరింది. దేశంలో తిరిగి శాంతిని నెలకోల్పాలని సూడాన్ లోని పార్టీలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







