RTA బస్సులో మహిళ ప్రసవం: తన అనుభవాలను తెలిపిన డ్రైవర్
- June 09, 2023
దుబాయ్: 41 ఏళ్ల ఈజిప్షియన్ బస్సు డ్రైవర్ మొహమ్మద్ ముస్తఫా.. 2007 నుండి పబ్లిక్ బస్సు డ్రైవర్‌గా సేవలు అందిస్తున్నాడు. జూన్ 7న దుబాయ్ నుండి అజ్మాన్‌కు డబుల్ డెక్కర్ ఇంటర్‌సిటీ బస్సును నడుపుతుండగా.. పై అంతస్తులో ప్రయాణీకుల నుండి అరుపులు వినిపించాయని ముస్తఫా తెలిపాడు. బస్సును ఆపి వెళ్లి చూడగా.. ఓ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతుంది. వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయమని చెప్పిన ముస్తఫా .. బస్ ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందించాడు. ప్రయాణికులను వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌తో పాటు మరో బస్సును పంపింది. మహిళ తనవెంట ఎవరూ లేరని గ్రహించి.. ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లే వరకు అండగా నిలిచాడు. "ఆమె నా సోదరిలా అనిపించింది," అని ముస్తఫా అనంతరం స్పందించాడు. "నేను ఆమెను రిలాక్స్‌గా ఉంచేందుకు చేయగలిగినంత ప్రయత్నించాను. ఆమె మనస్సును శాంతపరచడానికి నేను ఆమెకు సానుకూల విషయాలను చెప్పాను. కొద్ది సమయంలో ఆస్పత్రి వస్తుందని ఆమెకు భరోసా ఇచ్చాను.’’ అని తన అనుభవాలను వివరించారు. "నా భార్య జన్మనివ్వడం నాకు గుర్తుంది. ఉన్న జ్ఞానంతో ప్రసవ వేదనను తగ్గించడానికి ఆమె శ్వాసను ఎలా నియంత్రించాలో నేను ఆమెకు శిక్షణ ఇచ్చాను" అని అతను చెప్పాడు. ఉగాండాకు చెందిన గర్భిణీ బుధవారం ఉదయం ఆర్‌టీఏ పబ్లిక్ బస్సు పై డెక్‌పై ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







