గ్రాండ్ గా బాలకృష్ణ 109 మూవీ ఓపెనింగ్
- June 10, 2023
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ 109 మూవీ ఓపెనింగ్ కార్యక్రమం ఈరోజు శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై. రవి శంకర్ తదితరులు హాజరయ్యారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథ రెడీ చేశారట. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవిని బాబీ ప్రజెంట్ చేసిన తీరు అభిమానులకు నచ్చింది. ఇప్పుడు బాలకృష్ణను సైతం అభిమానులు కోరుకునే విధంగా చూపించాలని డిసైడ్ అయ్యారట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









