‘రంగబలి’గా నాగశౌర్య.! ఇది కదా మాక్కావాల్సింది.!
- June 10, 2023
యంగ్ హీరో నాగశౌర్యకి పక్కింటబ్బాయ్ అనే ఫ్యామిలీ ఇమేజ్ వుంది. కానీ, ఈ మధ్య నాగ శౌర్య సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు ఆ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేస్తున్నాయ్.
దాంతో, ఆయన సినిమాలకు పెద్దగా ప్రేక్షకాదరణ దక్కడం లేదు. యాక్షన్, ఇన్నోవేషన్.. అంటూ కండలు గిండలు పెంచేసి సీరియస్ టోన్‌లో సినిమాలు చేసేయాలనుకుని చేతులు కాల్చేసుకున్నాడు ఇంతవరకూ నాగ శౌర్య.
ఇప్పుడే తత్వం బోధపడినట్లుంది కాబోలు. ‘రంగబలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్ చూసి ఇది కూడా కండల సినిమానే అనుకున్నారు. కానీ, మనోడు తనకున్న బలాన్నీ బలగాన్ని ఈ సినిమాలో దించబోతున్నాడనీ తాజాగా విడుదల చేసిన ప్రోమోని బట్టి అర్ధమవుతోంది.
తన బలమైన హ్యూమర్‌ని ఈ సినిమాలో హైలైట్ చేశాడు. గోదావరి యాసతో చెలరేగిపోయాడు. అలాగే, మాస్ ఎలిమెంట్లు కూడా పుష్కలంగా వున్నట్లు కనిపిస్తోంది. లక్ బాగుంటే, నాగ శౌర్య ‘రంగబలి’తో తిరిగి తన బలం చూపించేలానే వున్నాడు మరి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







