‘రంగబలి’గా నాగశౌర్య.! ఇది కదా మాక్కావాల్సింది.!

- June 10, 2023 , by Maagulf
‘రంగబలి’గా నాగశౌర్య.! ఇది కదా మాక్కావాల్సింది.!

యంగ్ హీరో నాగశౌర్యకి పక్కింటబ్బాయ్ అనే ఫ్యామిలీ ఇమేజ్ వుంది. కానీ, ఈ మధ్య నాగ శౌర్య సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు ఆ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేస్తున్నాయ్.
దాంతో, ఆయన సినిమాలకు పెద్దగా ప్రేక్షకాదరణ దక్కడం లేదు. యాక్షన్, ఇన్నోవేషన్.. అంటూ కండలు గిండలు పెంచేసి సీరియస్ టోన్‌లో సినిమాలు చేసేయాలనుకుని చేతులు కాల్చేసుకున్నాడు ఇంతవరకూ నాగ శౌర్య.
ఇప్పుడే తత్వం బోధపడినట్లుంది కాబోలు. ‘రంగబలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్ చూసి ఇది కూడా కండల సినిమానే అనుకున్నారు. కానీ, మనోడు తనకున్న బలాన్నీ బలగాన్ని ఈ సినిమాలో దించబోతున్నాడనీ తాజాగా విడుదల చేసిన ప్రోమోని బట్టి అర్ధమవుతోంది.
తన బలమైన హ్యూమర్‌ని ఈ సినిమాలో హైలైట్ చేశాడు. గోదావరి యాసతో చెలరేగిపోయాడు. అలాగే, మాస్ ఎలిమెంట్లు కూడా పుష్కలంగా వున్నట్లు కనిపిస్తోంది. లక్ బాగుంటే, నాగ శౌర్య ‘రంగబలి’తో తిరిగి తన బలం చూపించేలానే వున్నాడు మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com