2024 WEC సీజన్-ఫైనల్‌కు బహ్రెయిన్ హోస్ట్

- June 10, 2023 , by Maagulf
2024 WEC సీజన్-ఫైనల్‌కు బహ్రెయిన్ హోస్ట్

బహ్రెయిన్: FIA వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్ (WEC) 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. బాప్కో ఎనర్జీస్ 8 అవర్స్ ఆఫ్ బహ్రెయిన్ వచ్చే ఏడాది నవంబర్ 1,  2 తేదీలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC)లో “ది హోమ్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్ ఇన్ మిడిల్ ఈస్ట్" కు హోస్ట్ చేయనుంది. కొత్త ఛాంపియన్‌షిప్ క్యాలెండర్ మొత్తం ఎనిమిది రౌండ్‌లను కలిగి ఉంది.  WEC చరిత్రలో ఎనిమిదోసారి సీజన్-ఫైనల్‌ను నిర్వహించే గౌరవాన్ని బహ్రెయిన్ పొందింది. 2012లో ప్రారంభ సీజన్ నుండి కింగ్‌డమ్ WEC ప్రచారంలో భాగంగా ఉంది.  తాజా ఫైనల్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్‌లో బహ్రెయిన్ అత్యున్నత స్థాయిని మరింత సుస్థిరం చేస్తుంది. BICలో 2023 నవంబర్ 3, 4 లేదీలలో జరిగే ఈ సంవత్సరం బాప్కో ఎనర్జీస్ 8 అవర్స్ ఆఫ్ బహ్రెయిన్ టిక్కెట్‌లు ఇప్పటికే అమ్మకానికి విడుదల చేశారు.  రెండు రోజుల WEC వారాంతంలో పెద్దలకు కేవలం BD5,  పిల్లల కోసం BD2.5 టిక్కెట్‌ల ధర ఉంటుంది. టిక్కెట్లను bahraingp.com లో లేదా BIC హాట్‌లైన్‌కి +973-17450000కి కాల్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది 2024 బాప్కో ఎనర్జీస్ 8 అవర్స్ ఆఫ్ బహ్రెయిన్ ఖతార్, ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్, బ్రెజిల్, అమెరికా, జపాన్‌లలో జరుగుతుంది. దోహా రౌండ్ తదుపరి WEC సీజన్‌లో నాలుగు కొత్త వేదికలలో ఒకటిగా ఉంటుంది.   ఖతార్ 1812కిమీ పేరుతో సరికొత్త ఈవెంట్, 2024 మార్చి 2న ఛాంపియన్‌షిప్ ప్రారంభం అవుతంది.  దోహాలోని లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫిబ్రవరి 24,  25 తేదీల్లో అధికారిక ప్రోలోగ్ కూడా నిర్వహించబడుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com