పనితనం ఆధారంగా టిక్కెట్లు: పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

- June 10, 2023 , by Maagulf
పనితనం ఆధారంగా టిక్కెట్లు: పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజు మంచి ఉదాహరణ అన్నారు. ఆరు నెలలు కష్టపడి పని చేయాలని, పనితనం ఆధారంగా టిక్కెట్లు వస్తాయని చెప్పారు. సర్వేల ప్రాతిపదికన టిక్కెట్లు ఇస్తారన్నారు. అందరం కలిసి కట్టుగా పని చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే సమయంలో నాలుగు తీర్మానాలు ప్రవేశ పెట్టారు.

ఏఐసీసీ సెక్రటరీలు బోసురాజు, జావీద్ లను అభినందిస్తూ ఓ తీర్మానం, కొత్తగా నియమితులైన సెక్రటరీలకు స్వాగతం పలుకుతూ రెండు వేర్వేరు తీర్మానాలు చేశారు. అలాగే బోయినపల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియా గాంధీని ఆహ్వానించాలని మరో తీర్మానం ప్రవేశ పెట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 1000 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందిస్తూ నాలుగో తీర్మానం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com