పిల్లల మేనమామగా విద్యాకానుక అందిస్తున్నా: ఏపీ సిఎం జగన్
- June 12, 2023
అమరావతి: ఏపీ సిఎం జగన్ సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు విద్యాకానుక కిట్ల పంపిణీ పండుగలా జరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రజాప్రతినిధులు అందరూ ఈ పండుగలో పాల్గొంటున్నారని వివరించారు. వరుసగా నాలుగో ఏడాది విద్యాకానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యాకానుక అందిస్తున్నామని జగన్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు. ఓటు హక్కులేని చిన్న పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నది గత ప్రభుత్వ ఆలోచన.. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఈ చిన్నారుల మేనమామ ప్రభుత్వమే. అందుకే ఓ మేనమామగా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకు ఖర్చుకు వెనకాడకుండా పాటుపడుతున్నట్లు సిఎం జగన్ పేర్కొన్నారు.
ఈ కిట్లలోనూ మెరుగైన మార్పులు చేశామని వివరించారు. స్కూలు బ్యాగు సైజు పెంచామని, యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశామని పేర్కొన్నారు. ఈ ఒక్క పథకంపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.3,366 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్యా సదుపాయాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. నాడూ నేడూ కార్యక్రమం చేపట్టామని, డిజిటల్ విద్యను ప్రతీ విద్యార్థికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







