చైనాలో ఉన్న ఆఖరి భారత జర్నలిస్టును కూడా వెళ్లిపోవాలని ఆదేశం
- June 12, 2023
బీజింగ్: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ జర్నలిస్టులను చైనా పంపించేస్తోంది. మన జర్నలిస్టుల వీసాలను కూడా రెన్యువల్ చేయడం లేదు. ఏప్రిల్ లో హిందూ న్యూస్ పేపర్, ప్రసారభారతి, హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టర్ల వీసాలను రెన్యువల్ చేయలేదు. దీంతో వీరు ఇండియాకు తిరిగొచ్చారు.
మరోవైపు చైనాలో ఉన్ని చివరి భారతీయ జర్నలిస్టు, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ ను ఈ నెలాఖరులోగా చైనాను వీడి పోవాలని ఆదేశించింది. ఇంకోవైపు దీనిపై స్పందించేందుకు చైనా విదేశాంగ శాఖ నిరాకరించింది. ఇదిలావుంచితే, ఈ నెల ప్రారంభంలో భారత అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ మన దేశంలో చైనా జర్నలిస్టులు స్వేచ్ఛగా పని చేసుకుంటున్నారని… కానీ, చైనాలో మనవాళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







