వైట్ హౌస్ లో భారత ఇంజినీర్ కు ఉన్నత హోదా..
- May 12, 2016
వైట్ హౌస్ లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి ఉన్నత స్థానం దక్కింది. పాలనలో అతి ముఖ్యమైన సలహా కమిటీలో ఇంజినీర్ మంజీత్ సింగ్ ను సభ్యుడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. మంజీత్ సింగ్ అమెరికాలో సిక్కుల హక్కులు, ఎడ్యూకేషన్ ఫండ్ సంస్థ సహవ్యవస్థాపకుడు. గురువారం జరిగిన ఈ నియామకంపై వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరచడంతో నూతనంగా ఎన్నికైన వారు మరింత కృషి చేయాలని ఒబామా సూచించారు.గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మాస్టర్ సైన్స్ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో ఆయన ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2013లో మంజీత్ సింగ్ ఓ స్టాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించి తన సేవలను మరింత విస్తృతం చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా అమెరికా అధ్యక్షుడి పరిపాలన విభాగంలో ఉన్నత హోదా దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







